: బాబా రాందేవ్ తో యోగా చేసిన కేంద్ర మంత్రిపై విమర్శల వెల్లువ!


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. బీహార్ లోని మోతీహరి ప్రాంతంలో నిర్వహించిన ఓ యోగా కార్యక్రమంలో యోగా గురు రాందేవ్ బాబా తో కలసి రాధా మోహన్ యోగాలో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు మధ్యప్రదేశ్ లో రైతులంతా నానా కష్టాలు పడుతూ, రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తుంటే... రాధా మోహన్ మాత్రం ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని మండుపడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని మాందసౌర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడంతో... ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. రైతుల మృతి పట్ల బీజేపీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి చేసిన పనితో... పుండు మీద కారం చల్లినట్టైంది. 

  • Loading...

More Telugu News