: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కోహ్లీ డకౌట్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మలింగ బౌలింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా క్రీజులోకి వచ్చీ రాగానే అవుటయ్యాడు. ఒక్కపరుగు కూడా చేయకుండానే ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. మరోవైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఆయన 52 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 25.5 ఓవర్లకి 139 పరుగులుగా ఉంది.