: తగ్గిన బంగారం, వెండి ధరలు!


ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.195 తగ్గడంతో రూ.29,600 కు చేరింది. అదేవిధంగా, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.150 తగ్గి రూ.40,750కు చేరింది. కాగా, వరుసగా నాలుగు రోజుల పాటు బంగారం ధర పెరుగుతూ వచ్చినా, ఈ రోజు ట్రేడింగ్ లో ఒక్కసారిగా పడిపోయింది. పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైనట్టు బులియన్ ట్రేడింగ్ వర్గాల సమాచారం. 

  • Loading...

More Telugu News