: ప్రభాస్ ‘సాహో’కి హీరోయిన్ ఖరారు!


‘బాహుబలి-2’ సినిమా త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓకే చెప్పిన ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుందామ‌నే విష‌యంపై ఆ సినిమా యూనిట్ పెద్ద కసరత్తే చేసింది. పలువురు బాలీవుడ్ భామ‌ల‌తో ఈ విష‌యంపై చ‌ర్చ‌లు కూడా జ‌రిపింది. అయితే, చివ‌రికి ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించేందుకు స్వీటీ అనుష్క‌నే ఎంపిక చేసినట్లు తెలిసింది. మిర్చి, బాహుబలి వంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రభాస్ స‌ర‌స‌న అనుష్క న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఈ జోడీ ఒకే తెర‌పై క‌నిపించ‌నుండ‌డంతో వారిద్ద‌రి అభిమానులకు అది పండగే అని చెప్పచ్చు.

'సాహో'లో ప్ర‌భాస్‌కు జోడీగా ముందుగా శ్రద్ధా కపూర్, దిశా పటానీ వంటి వాళ్లను తీసుకుందామ‌ని ఆ సినిమా యూనిట్ అనుకుంది. అనంత‌రం కూడా మ‌రి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించింది. అయితే, వారు దిమ్మ‌తిరిగే రెమ్యూనరేషన్ డిమాండ్ చేయ‌డంతో వారిని ‘సాహో’ యూనిట్ రిజెక్ట్ చేసింది.

  • Loading...

More Telugu News