: అయ్యన్నపాత్రుడు అంగీకరించారు...విష్టు కుమార్ రాజు వాపోయారు: విజయసాయిరెడ్డి


విశాఖపట్టణంలో భారీ భూ కుంభకోణం జరిగిందని మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా అంగీకరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో భూకుంభకోణాలపై ఆ పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ శివార్లలో వందల ఎకరాలను అధికారపార్టీకి చెందిన నేతలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఏకంగా రికార్డులనే ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు భూములను కూడా కబ్జా కోరులు ఆక్రమించారని ఆయన చెప్పారు. తాను స్వయంగా ఆయనతో మాట్లాడానని, ఆయన దానిని అంగీకరించారని చెప్పారు. ఈ భారీ భూ కుంభకోణంలో అధికారపార్టీ నేతలు, అధికారులు అంతా భాగస్వాములేనని ఆయన చెప్పారు. సుమారు లక్ష ఎకరాల్లో ఈ కుంభకోణం జరిగి ఉంటుందని అంచనావేస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News