: ఒక వ్యక్తి ప్రేమ దగ్గరే ఆగిపోను...రిలేషన్ షిప్స్ లో కొత్తదనం ఉంటుంది: ప్రియాంకా చోప్రా


ప్రముఖ సినీ నటి ప్రియాంకా చోప్రా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. హాలీవుడ్ కు వెళ్లిన తరువాత మరింత స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. బేవాచ్ సినిమా ప్రమోషన్ లో ఆమె చెప్పిన కొన్ని అభిప్రాయాల్లోకి వెళ్తే... తాను కేవలం ఒక వ్యక్తి ప్రేమ దగ్గరే ఆగిపోనని చెప్పింది. జీవింతంలో ప్రతి రిలేషన్ షిప్ కు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. ప్రతి రిలేషన్ షిప్ లోనూ కొత్తదనం ఉంటుందని తెలిపింది. అదీకాక ప్రేమకు హద్దులు లేవని, అందుకే ప్రేమను కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయలేమని పేర్కొంది. తన కుటుంబమే తనకు పెద్ద బలం, బలహీనత అని ప్రియాంక చెప్పింది. తాను పబ్లిక్ ఫగర్ ను కనుక తన గురించిన 90 శాతం విషయాలు ప్రజలకు తెలుస్తుందని, మిగిలిన 10 శాతం తన వ్యక్తిగతమని చెప్పింది.

క్రియేటివ్ పీపుల్ తనకు నచ్చుతారని చెప్పింది. అలాంటి వాళ్లే జీవితానికి రంగులద్దుతారని అభిప్రాయపడింది. తన కుటుంబం తనకు ఇండివిడ్యువాలిటీ నేర్పిందని తెలిపింది. అందుకే తాను ఇండిపెండెంట్ గా ఉంటానని చెప్పింది. అలాగే పిల్లలతో ఆడుకోవడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. పిల్లలతో గడిపేందుకే పెద్దవాళ్లతో మాట్లాడుతానని తెలిపింది. సమాజంలో చోటుచేసుకుంటున్న దారుణాలకు భయపడి ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచకూడదని, బయటకు పంపితేనే వారిలో ధైర్యం పెరుగుతుందని, సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం అలవడుతుందని ప్రియాంక తెలిపింది. 

  • Loading...

More Telugu News