: 11 లక్షల విలువైన బంగారం తీసుకుని డీఎస్పీ మోసం చేశాడు: ఫిర్యాదు చేసిన బంగారం వ్యాపారి


పోలీసు ఉన్నతాధికారి 11 లక్షల రూపాయల విలువైన బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని బంగారం వర్తకుడు హైదరాబాదు శివారు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఆల్వాల్ లో బంగారం వ్యాపారం చేసే రాములు నగలు తయారు చేసి, పలు దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. ఆయనకు మహబూబ్‌ నగర్‌ సీసీఎస్‌ డీఎస్పీ మురళీమనోహర్‌ తో స్నేహం ఉంది. ఈ స్నేహాన్ని పురస్కరించుకుని...రెండు రోజుల్లో డబ్బులిస్తానని చెబుతూ చెక్కులు ఇచ్చి, 2016 ఫిబ్రవరిలో రాములు నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను మురళీమనోహర్‌ తీసుకున్నారు. అనంతరం ఆయన మాటతప్పారు. రెండు రోజుల తరువాత డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకుండా పోయాయి. దీంతో న్యాయం చేయాలని కోరుతూ ఆయన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News