: నాలుగు వికెట్లు కోల్పోయి.. వంద పరుగులకు చేరిన సఫారీలు!


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు బౌలింగ్ లో ఆకట్టుకుంటోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. డికాక్ (33) ఆకట్టుకున్నా నిలదొక్కుకోలేకపోయాడు. ఆమ్లా (16), డివిలియర్స్ (0) దారుణంగా విఫలం కాగా, డుప్లెసిస్ (26) కూడా నిలబడలేకపోయాడు. దీంతో క్రీజులో డేవిడ్ మిల్లర్ (29)కు జతగా జేపీ డుమిని (6) ఉన్నాడు. ఈ నేపథ్యంలో 28 ఓవర్లు ఆడిన సఫారీలు నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం రెండు వికెట్లతో ఆకట్టుకోగా, హఫీజ్, హసన్ అలీ చెరొక వికెట్ తీసి సహకరించారు. 

  • Loading...

More Telugu News