: 116 మందితో వెళ్తున్న మయన్మార్ సైనిక విమానం గల్లంతు


మయన్మార్ సైనిక విమానం గగనతలంలో గల్లంతైంది. ఇందులో 116 మంది ప్రయాణికులు వున్నారు. ఉత్తర మయన్మార్ పట్టణమైన మైయెక్, యన్గొన్ మధ్య విమానం అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో విమానం ప్రయాణిస్తుండగా కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. విమానంలో 105 గురు ప్రయాణికులు 11 మంది సిబ్బంది ఉన్నారని వారు తెలిపారు. విమానం కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News