: పాకిస్థాన్ ను వాడుకుంటున్న చైనా... పెంటగాన్ కీలక నివేదిక!


చైనా తన భవిష్యత్ సైనిక స్థావరాలను పాకిస్థాన్ లో నిర్మించనుందని, దీని వల్ల దక్షిణాసియాలో తీవ్ర అనిశ్చితి తలెత్తే ప్రమాదముందని యూఎస్ డిఫెన్స్ వర్గాలు కీలక నివేదికను విడుదల చేశాయి. ఆఫ్రికా దేశమైన డిజిబౌతీలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న చైనా, ఇప్పుడు పాక్ వైపు అడుగులు వేస్తోందని పెంటగాన్ తయారు చేసిన 97 పేజీల వార్షిక నివేదికలో అధికారులు అంచనా వేశారు.

2016లో దాదాపు 140.4 బిలియన్ డాలర్లను చైనా తన రక్షణ శాఖకు కేటాయించిందని తెలిపారు. ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కెనాల్ లోకి ప్రవేశించేందుకు వ్యూహాత్మక ప్రదేశమైన డిజిబౌతీలో చైనా ఇప్పటికే తొలి అంతర్జాతీయ నావెల్ బేస్ ను సిద్ధం చేసుకుందని తెలిపింది. పలు ప్రాంతాల్లో అదనపు సైనిక స్థావరాల కోసం చైనా యత్నిస్తోందని, ఆ జాబితాలో ఇప్పుడు పాకిస్థాన్ ముందుందని పేర్కొంది. కాగా, ఈ నివేదికలో చైనా ప్రయత్నాలపై ఇండియా ఎలా స్పందించనుందన్న విషయమై ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఇప్పటికే చైనా ఆయుధాలకు దిగుమతిదారుగా ఉన్న పాక్, చైనా సైనిక స్థావరాన్ని తమ దేశంలో ఏర్పాటు చేసుకోనిచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలు పెట్టకపోవచ్చని పెంటగాన్ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News