: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులోని రాఘవరాజపురం వద్ద ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బొలేరో వాహనం ఒకదానినొకటి ఢీకొన్న సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మరికొందరు గాయపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం ఈడిగపల్లికి చెందిన బొలేరో వాహనాన్ని బాడుగకు తీసుకుని షిర్డీ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొలేరో డ్రైవర్ సురేష్ (26), రాజశేఖర్(34), మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.