: పొలం వివాదంలో అన్నదమ్ములపై కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు!
పొలం వివాదం విషయమై అన్నదమ్ములిద్దరినీ వెంటాడి మరీ నరికిన దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరుకు చెందిన బండి రాంబాబు, బండి బాబూరావులు అన్నదమ్ములు. పొలం వివాదం విషయమై ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఫిర్యాదు చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అనంతరం, తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే కాపు గాసి ఉన్న ప్రత్యర్థులు అన్నదమ్ములిద్దరినీ వెంటాడి మరీ, వేట కొడవళ్లతో నరికారు. తీవ్రంగా గాయపడిన వాళ్లిద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఏలూరు వన్ టౌన్ లో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.