: కోర్టులకు రాజకీయాలెందుకు? అమెరికాకు వచ్చే వారిపై నిబంధనలు కఠినంగానే వుండాలి!: ట్రంప్ కీలక ట్వీట్లు


అమెరికాలో కాలు పెడుతున్న వారిపై మరింత కఠినంగా ఉండాల్సిందేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేస్తూ, ప్రయాణంపై నిబంధనలు, అమలవుతున్న విధానం కఠినంగా ఉండాలని అన్నారు. ప్రయాణ నిషేధంపై మొదట ఇచ్చిన ఆదేశాలకే న్యాయ వ్యవస్థ కట్టుబడి వుండాలని కోరారు. కోర్టులు నెమ్మదిగా పని చేస్తున్నాయని ఆక్షేపించారు. రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. నీరుగారిపోయిన, రాజకీయ మార్పులు చేయబడ్డ ఉత్తర్వులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దేశ భద్రత కోసం అమెరికా గడ్డపై కాలుపెట్టే వారిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందేనని ట్రంప్ కీలక ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News