: మరోమారు అమ్మకానికి వస్తున్న రెడ్మీ 4.. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా విక్రయాలు
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఇటీవల విడుదల చేసి రెడ్మీ 4 మరోమారు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్ కామ్‌లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.6,999 ధర కలిగిన ఈ ఫోన్‌ను షియోమీ గత నెల మధ్యలో భారత్‌లో మూడు వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఇచ్చిన ఆఫర్లనే నేడు కూడా ప్రకటించనుంది. రెడ్మీ 4 ఇటీవలి విక్రయాలు దుమ్మురేపాయి. అమ్మకానికి పెట్టిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవడం ఆ ఫోన్‌పై వినియోగదారులకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.