: కాంగ్రెస్ నేతల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది: మంత్రి నారాయణ
రాష్ట్ర పునర్విభజన హామీలకు కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించలేదని, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఆ పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మంత్రి నారాయణ విమర్శించారు. విభజన కష్టాలను అధిగమించి, రాష్ట్రాన్ని సంక్షేమాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ పాలన సాగుతోందని, ప్రతి పేదవాడు సంతోషంగా జీవించేందుకే, చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని నారాయణ అన్నారు.