: దేశం గర్విస్తోంది: ఇస్రో సూపర్ సక్సెస్ ను కొనియాడిన ప్రణబ్‌ముఖర్జీ, మోదీ
జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నట్లు ప్రబణ్ ముఖర్జీ చెప్పారు. ఈ గొప్ప విజయం దేశాన్ని గర్వపడేలా చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక, సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుందని చెప్పారు.
Congratulations to the dedicated scientists of ISRO for the successful launch of GSLV – MKIII D1/GSAT-19 mission.
— Narendra Modi (@narendramodi) June 5, 2017