: నాపై కేసులు పెడితే టీఆర్ఎస్ నేతలకు నిద్రలేకుండా చేస్తా: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి


సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమవడంతో మంత్రి హరీష్ రావు మెంటల్ గా మారారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమీన్ పూర్ భూముల కేసును తిరగదోడుతున్నారని, ఈ విషయమై సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. సర్పంచ్ తొలగింపు ఆపకపోతే కలెక్టర్ ను ఘెరావ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అమీన్ పూర్ భూముల కేసు వ్యవహారంలో తనపై కేసులు పెట్టిన మర్నాడే తన దమ్మేంటో చూపిస్తానని, టీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తానని జయప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News