: కేటీఆర్! నోటి కొచ్చినట్టు మాట్లాడితే కుదరదు: కాంగ్రెస్ నేత రమ్యారావు


రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదని, నోటి కొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నేత రేగులపాటి రమ్యారావు హెచ్చరించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేవలం సీఎం కొడుకు అయినందువల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని, లేకపోతే, ఆయన స్థానం ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News