: ఆ రోజున ప్రభాస్‌ 15 రకాల బిర్యానీలు వండించుకున్నాడు: దర్శకుడు రాజమౌళి


దర్శకుడు రాజమౌళి అత్యద్భుతంగా తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్ర ప్రచారం నిమిత్తం యూనిట్ సభ్యులు ఇటీవల లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ,‘ఈ సినిమా కోసం ప్రభాస్, రానా లు కఠిన ఆహార నియమాలు పాటించారు. అవి తినండి, ఇవి తినండి అని నేనేమీ సలహాలు ఇచ్చేవాడిని కాదు. దేహదారుఢ్యం కోసం వాళ్లే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే, ప్రభాస్, రానాకి నెలకోసారి ‘చీట్ మీల్ డే’ ఉండేది. 'చీట్ మీల్ డే' నాడు ఎలాంటి ఆహార నిబంధనలు లేకుండా అన్నీ తినొచ్చు. ఓ ‘చీట్ మీల్ డే’ నాడు ప్రభాస్ 15 రకాల బిర్యానీలు వండించుకున్నాడు. చేపల పులుసు, చికెన్, మటన్ కర్రీలూ చేయించుకునేవాడు. ఎన్ని వంటకాలు ఉన్నా చట్నీ లేకుండా మాత్రం తినేవాడు కాదు. ఓ రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకూ మేమంతా ఫుట్ బాల్ ఆడాం. గేమ్ అయిపోగానే తినేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు. వెరైటీ వంటకాలు చాలా ఉన్నాయి. ఇన్ని వంటకాలున్నా..‘చట్నీ ఎక్కడుంది?’ అని అక్కడే ఉన్న తన బావను ప్రభాస్ అడిగాడు. ఆ తెల్లవారుజామున ప్రభాస్ బావ వెంటనే ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తన భార్యను లేపి, అప్పటికప్పుడు చట్నీ చేయించుకుని వచ్చారు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News