: భద్రాద్రి రాముడిని కూడా దక్కకుండా చేసింది ఆ పార్టీనే: సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న దానిపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ విసిరారు. పదేళ్ల పాటు మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి ఆయన సొంత జిల్లా అనంతపురంకు కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. భద్రాచల రాముడిని కూడా ఏపీకి రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్మగూడెం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కింద ఏపీకి రావాల్సిన 200 టీఎంసీల నీటిని రాకుండా చేసింది కూడా ఆ పార్టీనే అని దుయ్యబట్టారు. ఏపీకి చేయాల్సిన అన్యాయమంతా చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News