: ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ సభ పెడుతోంది?: ఏపీ మంత్రుల మండిపాటు
ఏపీలో ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సభ పెడుతోందని, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ప్రాంతంలో పర్యటించడానికి సిగ్గుండాలని మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఆనందబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని గంటల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ జరగనున్న నేపథ్యంలో మంత్రులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయిందని, ఇప్పుడు సిగ్గు లేకుండా సభ పెడుతోందని మండిపడ్డారు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్నా రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తమ పార్టీదేనని వారు అన్నారు.