: రేపటి మ్యాచ్ లో భారత్‌‌ను ఓడించండి!: క్రికెటర్లకు హితబోధ చేసిన పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్


క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భార‌త్‌, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్ సహర్యార్ ఖాన్ త‌మ‌ దేశ క్రికెటర్లకి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2017లో మొదటి మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్‌.. ఇండియాను చిత్తుగా ఓడించాల‌ని, అలాగే ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లి క‌ప్పుకొట్టుకురావాల‌ని అన్నారు.

ఈ రోజు త‌మ‌ జట్టు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయ‌న‌... భార‌త్, పాక్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ అని అన్నాడు. ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తార‌ని, ఈ మ్యాచ్‌లో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వ‌కూడ‌ద‌ని అన్నాడు. పాక్‌ జట్టు ప్రదర్శనపై భారీ అంచనాలున్నాయని చెప్పారు. అద్భుతంగా రాణించి భారత్‌ని ఓడించాల‌ని అన్నారు.                                   

  • Loading...

More Telugu News