: కాకినాడలో విద్యార్థిని ప్రాణం తీసిన హోర్డింగ్!
కాకినాడలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జ్యోతుల మార్కెట్ దగ్గర హోర్డింగ్ ఊడిపడడంతో ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఆ మృతురాలు ఇంద్రపాలెం(బి) కు చెందిన వాసంశెట్టి శాంతిగా గుర్తించారు. ఆమె బీఫార్మసీ చదువుతోందని పోలీసులు తెలిపారు. తల, వీపు భాగాల్లో బలమైన గాయాలు తగలడంతో ఆ విద్యార్థిని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో హోర్డింగ్ లు ప్రాణం తీస్తున్నా కాకినాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాంతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.