: హైదరాబాద్‌లో వర్షం.. ఉపశమనం పొందిన నగరవాసులు!
హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఈ రోజు మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరవాసులు సేదతీరారు. నగరంలోని నాంపల్లి, అబిడ్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్, నక్లెస్ రోడ్, సెక్రటేరియట్ రోడ్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, చిలకలగూడ, తిరుమలగిరిలలో ఓ మోస్తరు వర్షం పడింది. ఎండలతో చమటలు కారుస్తున్న నగరవాసులు గత రెండు రోజులుగా పడుతున్న చిరుజల్లులతో ఉపశమనం పొందుతున్నారు.