: పాకిస్థాన్ వెబ్ సైట్లలో మన మాజీ బీఎస్ఎఫ్ జవాన్ వీడియో వైరల్


సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారంటూ ఈ ఏడాది మొదట్లో బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఓ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో పాకిస్థానీ వెబ్ సైట్లలో స్వైర విహారం చేస్తోంది. ఈ విషయాన్ని మన దేశ నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే, మొత్తం 24 వెబ్ సైట్లలో 21 వెబ్ సైట్లు పాకిస్థాన్ వెలుపలి నుంచి పనిచేస్తున్నవిగా దర్యాప్తులో వెల్లడైంది.

నీళ్లలా ఉన్న పప్పు, కాల్చిన చపాతీలు నాసిరకంగా ఉన్నాయంటూ తీసిన వీడియోను తేజ్ బహదూర్ యాదవ్ నాడు పోస్ట్ చేయగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత యాదవ్ ను ఉద్యోగం నుంచి తొలగించడం కూడా తెలిసిందే. వాట్సాప్, ఫేస్ బుక్ వేదికల్లో వీడియోలను పోస్ట్ చేయవద్దంటూ తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ భద్రతా బలగాలను కోరారు. శత్రుదేశం సామాజిక మాధ్యమాల్లో వదంతుల సృష్టికి అదే పనిగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News