: ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే నా కల: గాలి జనార్దన్ రెడ్డి


యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే తన కల అని మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని... పార్టీ అధిష్ఠానం తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్లు జైల్లో గడిపిన గాలి... గత ఏడాది బెయిల్ పై విడుదలయ్యారు. 

  • Loading...

More Telugu News