: కేసీఆర్ ను ఆయన నియోజకవర్గంలోనే ఓడిస్తాం: కోమటిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ పాలన పట్ల జనాలు విసిగిపోయారని తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా 10 లక్షల మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభను నిర్వహిస్తామని చెప్పారు.
టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దశాబ్దాలుగా పోరాడి, ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు బేడీలు వేసిన ఈ దుర్మార్గపు ప్రభుత్వం మనకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. 1979లో సంగారెడ్డి మైదానం నుంచి సందేశం ఇచ్చిన ఇందిరాగాంధీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 2019లో కేసీఆర్ ఖేల్ ఖతమేనని ధీమాగా చెప్పారు. నిన్న సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడుతూ వీరు పైవ్యాఖ్యలు చేశారు.