: ఢిల్లీలో భూ ప్రకంపనలు... ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు!
ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోయారు. తమ తమ విధులకు హాజరుకావడానికి అంతా సిద్ధమవుతుండగా ప్రకంపనలు సంభవించడంతో ఇళ్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది.