: మందుబాబు ఆగడం... ఆకాశంలో విమానం డోర్ తీయబోయాడు!
రష్యా నుంచి భారత్ వచ్చే విమానంలో పూటుగా తాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోబోయాడు. సిబ్బంది వేగంగా ప్రతిస్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఏరోఫ్లాట్ ఎస్యూ 232 రకానికి చెందిన విమానం రష్యాలోని మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరింది. విమానం కొన్ని వేల అడుగుల ఎత్తుకి వెళ్లిన అనంతరం పూటుగా తాగి ఉన్న రష్యాకు చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తి విమానం డోర్ తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిపై తోటి ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వెంటనే చేరుకున్న సిబ్బంది అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతని తీరుతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే... అతనిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.