: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ అత్యల్పంగా 8 పాయింట్లు కోల్పోయి 31,137 వద్ద ముగిస్తే, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9,616 వద్ద ముగిసింది. దేశీయ సూచీలు ఈ రోజు ఉదయం నుంచి ఒడుదొడుకులకు లోనయ్యాయని, జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడం వాటిపై పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 64.47గా ఉంది.
ఎన్ఎస్ఈలో టాప్ గెయినర్స్:
అదానీపోర్ట్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హిందుస్థాన్ యునిలివర్, టెక్‌మహీంద్రా
లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వేదాంత లిమిటెడ్.