: ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌లో ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్!


వాషింగ్టన్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌లో అక్రమంగా ఆయుధాలు కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెమీ-ఆటోమెటిక్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్ హోటల్ సెక్యూరిటీ సిబ్బంది, ఓ పౌరుడు ఇచ్చిన సమాచారంతో హోటల్‌కు చేరుకున్న భద్రతా సిబ్బందికి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీ చేయగా సెమీ-ఆటోమెటిక్ రైఫిల్ కనిపించింది. అతడి వాహనం నుంచి హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పెన్సిల్వేనియాకు చెందిన బ్రియాన్ మోల్స్‌గా గుర్తించారు. అక్రమంగా ఆయుధాలు కలిగినందుకు గాను అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News