: నోకియా అభిమానులకు శుభవార్త.. జూన్ 13న భారత్ వచ్చేస్తున్న నోకియా 6, 5, 3 స్మార్ట్‌ఫోన్లు!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోకియా అభిమానులకు శుభవార్త. వచ్చే నెల 13న నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3లు భారత్‌లో లాంచ్ కానున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ల విషయంలో నోకియా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 13న ఈ మూడు ఫోన్లు భారత్‌లో అడుగుపెట్టనున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన నోకియా నుంచి వెలువడే అవకాశం ఉంది.
డ్యూయల్ సిమ్‌తో వస్తున్న నోకియా 6లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్, ఆక్టాకోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడెర్నో 505 జీపీయూ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీల వరకు పెంచుకునే సదుపాయం, 16 ఎంపీ వెనక కెమెరా, 8 ఎంపీ ముందటి కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు. డిస్‌ప్లేలో తేడాలు తప్ప నోకియా 5, 3లోనూ కొంచెం అటూఇటుగా ఇవే ఫీచర్లు ఉన్నాయి.