: 'అరగంటలో నచ్చింది ఫ్రీగా తీసుకోండి' అనగానే ఎగబడిపోయారు... వీడియో చూడండి!


సౌదీఅరేబియాలో రంజాన్ ను పురస్కరించుకుని పెద్దపెద్ద షాపింగ్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫెస్టివల్ సీజన్ ను పురస్కరించుకుని సౌదీఅరేబియాలో షాపింగ్ సందడి నెలకొంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలన్నీ భారీ ఆఫర్లను ప్రకటించాయి. దీంతో షాపింగ్ కు స్వర్గధామంగా పేరున్న సౌదీలో షాపింగ్ సందడి నెలకొంది. కేరళలోని కొచ్చి నగరంలో బ్రాంచ్ కలిగిన లూలు సంస్థ ఒక వినూత్న ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకుంది. సౌదీ అరేబియాలోని తమ స్టోర్ లో అరగంట సేపు ఫ్రీ ఆఫర్ ఉందని ప్రకటించింది.

రంజాన్ ను పురస్కరించుని అరగంట సేపు తమ షాపులోని ఏ వస్తువునైనా ఉచితంగా తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న వినియోగదారులు బారులుతీరారు. షాప్ ప్రకటించిన సమయం కోసం వేచి చూశారు. ఈ అరగంట సేపు వినియోగదారులు ఎగబడి తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లారు. పురుషులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ఎగబడగా, మహిళలు తమకు నచ్చిన వస్తువుల కోసం పరుగులు తీశారు. కాగా, రంజాన్ మాసంలో స్వచ్ఛందంగా దానం మంచిదని ఖురాన్ బోధిస్తుంది. అందుకనుగుణంగా ఈ ఆఫర్ పెట్టినట్టు లూలు సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News