: ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్ బై చెప్పిన మరో కీలక ఉద్యోగి!


దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో 'లాజిస్టిక్స్‌ యూనిట్‌ ఈ-కార్ట్‌'కు ఇంఛార్జిగా ఉన్న నితిన్‌ సేథ్ ఆ కంపెనీకి గుడ్ బై చెప్పారు. గతంలో ఆయన ఫ్లిప్‌కార్ట్ కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీస‌ర్‌గా కూడా ప‌నిచేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్‌ కార్పొరేట్‌ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న కీల‌క వ్య‌క్తిగా ఉండేవారు. ప్ర‌స్తుతం ఆయ‌న నిర్వ‌ర్తించిన‌ బాధ్యతల్ని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన నితిన్‌ సేథ్‌ అనతి కాలంలోనే సీఏవో, సీవోవోగా పదోన్నతి పొందారు. మ‌రోవైపు ప‌ది రోజుల క్రిత‌మే ఫ్లిప్‌కార్ట్‌కు మ‌రో ఇద్ద‌రు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్ గుడ్‌బై చెప్పారు.      

  • Loading...

More Telugu News