: సమాజం కోసం ఆస్తినే కోల్పోయిన గొప్ప వ్యక్తి దాసరి: నన్నపనేని
సమాజానికి సేవ చేసేందుకు దాసరి నారాయణరావు నిరంతరం తపన పడేవారని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. సంఘసేవ కోసం తన ఆస్తినే కోల్పోయిన మహనీయుడాయన అని చెప్పారు. పేద, బలహీన వర్గాలు, పేద సినీ కళాకారుల కోసం ఆయన ఎంతో చేశారని అన్నారు. ఫిలింఛాంబర్ వద్ద దాసరిని కడసారి సందర్శించుకుని, నివాళి అర్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. దాసరి ఎంతో నిరాడంబరంగా బతికారని, అందుకే అందరి మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని... దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయనను గౌరవించాలని కోరారు.