: బంగ్లాదేశ్‌లో 27 మందిని రక్షించిన భారత నేవీ.. రంగంలోకి దిగిన ‘సుమిత్ర’ నౌక
‘మోరా’ తుపాను ప్రభావం బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాలపై బలంగా పడింది. అక్కడి వారిని రక్షించేందుకు భారత్‌కు చెందిన నౌక సుమిత్ర రంగంలోకి దిగింది. ఆ దేశంలోని చిట్టగాంగ్ సమీపంలో కొట్టుకుపోతున్న 27 మందిని భారత్ కాపాడింది. భారత నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకె శర్మ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. తాము కాపాడిన 27 మందిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మోరా తుపాను వలన భీకరమైన గాలులు వీచి బంగ్లాదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. వరదల వల్ల ఇళ్లు నీట మునిగిపోయాయి. సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికి ఆరుగురు మృతి చెందారు.