: 80 మంది మృతి, 350 మందికి గాయాలు: ఆఫ్గన్ అధికారిక ప్రకటన
ఈ ఉదయం ఆఫ్గన్ రాజధాని కాబూల్ లోని భారత ఎంబసీ సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించగా, ఇప్పటివరకూ 80 మంది మృతి చెందారని, 350 మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు నామరూపాల్లేకుండా నాశనం కాగా, ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతుల్లో పలువురు విదేశీయులు ఉన్నట్టు తెలుస్తున్నా, వారు ఎవరన్న విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని, తమ తమ ఆఫీసులకు వెళుతున్న ఎంతో మంది అమాయకులతో పాటు పలువురు మహిళలు, చిన్నారులు కూడా మృతి చెందారని ఆఫ్గన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది.