: రజనీకాంత్ సినిమాకు కష్టాలు.. కథ నాదేనన్న రజనీ వియ్యంకుడి అసిస్టెంట్!


సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా'కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కథ తనదేనంటూ కె.రాజశేఖరన్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో 'కరికాలన్' అనే టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించానని... ఈ సినిమాను రజనీతోనే నిర్మించాలని భావించానని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుసుకుని, తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తన సొంత కథతో సినిమాను నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరో విషయం ఏమిటంటే కె.రాజశేఖరన్ అనే వ్యక్తి ఎవరో కాదు... రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తే. రజనీ కొత్త చిత్రం షూటింగ్ ఆదివారంనాడు ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News