: తప్పు, అలా చేయకండి... ఇది సమయం కాదు!: అభిమానులకు అల్లు అర్జున్ హితవు


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినీ ప్రముఖులంతా దాసరిని కడసారి చూసేందుకు తరలి వచ్చారు. అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ను అభిమానులు చుట్టుముట్టారు. అల్లు అర్జున్ ను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు వారంతా పోటీలు పడ్డారు.

దీంతో బౌన్సర్లు అతనికి రక్షణ కల్పించారు. ఈ సమయంలో మరికొందరు ఉత్సాహవంతులైన అభిమానులు అల్లు అర్జున్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు అలా చేయడం సరికాదని సైగలు చేశాడు. ఇది సమయం కాదని, ఇలాంటప్పుడు అలాంటి నినాదాలు చేయడం సరికాదని హితవు పలికాడు. ఆపేయాలని వారికి సూచించాడు. దీంతో అభిమానులు శాంతించారు. అనంతరం ఆయన దాసరి పార్థివదేహాన్ని సందర్శించి వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News