: మొదటికొచ్చిన విజయవాడ మెట్రో... టెండర్లన్నీ రద్దు
విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రాజెక్టు కోసం పలు కంపెనీలు వేసిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఎల్అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలు వేసిన టెండర్లను రద్దు చేస్తున్నామని, తిరిగి టెండర్లను ఎప్పుడు పిలుస్తామన్న విషయాన్ని తదుపరి వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు అమరావతి మెట్రో కార్పొరేషన్ కు లేఖ రాస్తూ, నిర్దేశిత అంచనా వ్యయం కంటే, అధికంగా కోట్ లు వచ్చాయని, డీఎంఆర్సీ ప్రతిపాదించిన అంచనా విలువతో పోలిస్తే, ఎంతో వ్యత్యాసం ఉన్నందునే టెండర్లు రద్దు చేశామని తెలిపింది.