: వేరే వాళ్లు దాసరిని తాకడానికి వీల్లేదు: 'ఆ నలుగురి' పేర్లు చెబుతూ మోహన్ బాబు సూచనలు
దాసరి నారాయణరావు మృతదేహాన్ని తరలించే వేళ, ఆయనకు అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు పలు సూచనలు చేస్తూ, అందరినీ అదుపులో పెట్టేందుకు ప్రయత్నించారు. దాసరిని మోయాల్సిన నలుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ, మధ్యలో మరో ఇద్దరు పట్టుకుని ఉండాలని, ఆ ఆరుగురు మినహా మరెవరూ దాసరిని తాకడానికి వీల్లేదని గట్టిగా తీవ్ర స్వరంతో చెప్పారు.
"ఇక మనం నేరుగా గుడి దగ్గరికి వెళుతున్నాం. అక్కడ నీళ్లు చల్లిన తరువాతే కింద పెడుతున్నాం. ఎవరూ తొందరపడకండి. నిదానంగా నడవండి... గోవిందా... గోవిందా" అంటూ ఆయన దేహంతో పాటు ముందుకు సాగారు. ముందు పోలీసు బ్యాండ్ సాగుతుండగా, ఆ వెనుక వేలాది మంది అభిమానులు, ప్రముఖులు దాసరి వెంట కదిలారు. మరికాసేపట్లో ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో దాసరి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.