: జూనియర్ నానితో హీరో నాని ఫొటో!


త‌న కుమారుడిని ప్రేమ‌గా త‌న గుండెల‌పై ప‌డుకోబెట్టుకుని, ముద్దాడుతూ హీరో నాని మురిసిపోయాడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి ‘అందరికీ హాయ్‌ చెప్పు అర్జున్‌’ అని పేర్కొన్నాడు. ఈ విధంగా తన కుమారుడి పేరు అర్జున్ అని తెలియజేశాడు. నాని పోస్ట్ చేసిన ఈ ఫొటో ఆయ‌న అభిమానులను అల‌రిస్తోంది.

నాని, అంజ‌న‌ల‌కి అర్జున్ ఈ ఏడాది మార్చి 29న పుట్టాడు. త‌న కుమారుడి ఫొటోను నాని మొద‌టిసారి పోస్ట్ చేశాడు. అర్జున్ ను ‘జూనియర్ నాని’ అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరో నేచురల్ హీరో పుట్టేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నానిని నేచుర‌ల్ స్టార్‌గా ఆయ‌న అభిమానులు పిలుచుకుంటారు.



  • Loading...

More Telugu News