: ఉదయం నుంచి బీపీ హెచ్చుతగ్గులు.. దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి విషమం?
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాసరికి అన్న వాహికలో సమస్య తలెత్తిన కారణంగా వైద్యులు ఆయనకు మూడు రోజుల క్రితం బెలూన్ సర్జరీ చేశారు. ఆయన నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ రోజు ఇన్‌ఫెక్షన్ సోకిందని, ఉదయం నుంచి బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడినట్టు తెలుస్తోంది. దాసరి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఆయనకు ఓ సర్జరీ జరిగింది. ఆయన కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది.