: రెండో పెళ్లికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకుని హత్య చేసిన తల్లి!


మాతృత్వానికే మచ్చ తెచ్చిందో తల్లి. సభ్య సమాజం తల దించుకునేలా, అత్యంత దారుణంగా ప్రవర్తించింది. తన రెండో పెళ్లికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళ్ల కొడుకును కిరాతకంగా చంపేసింది. అన్నంలో పురుగుల మందు కలిపి పసిబాలుడి ఉసురు తీసింది ఆ తల్లి. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముళ్లపాడులో జరిగింది. తన కుమారుడు కనిపించడం లేదని తొలుత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఈ నేపథ్యంలో, 27వ తేదీన బావిలో బాలుడి శవం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా... విషప్రయోగం జరిగినట్టు తేలింది. దీంతో, బాలుడి తల్లి సుజాతను కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కొడుకుని చంపేశానని ఆమె ఒప్పుకుంది. భర్తకు గత కొంతకాలంగా దూరంగా ఉన్న సుజాత... మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, అతడిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. 

  • Loading...

More Telugu News