: అల్లు అర్జున్ ‘డీజే’ నుంచి మరో సాంగ్ విడుదల.. బన్నీ డ్యాన్స్ అదిరిపోయిందంటున్న అభిమానులు
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’లోని టైటిల్ సాంగ్‌ను ఇప్పటికే ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం అదే సినిమాలోని మరో పాట విడుదలైంది. ‘గుడిలో .. బడిలో .. మడి’లో అంటూ సాగుతున్న ఈ సాంగ్ బన్నీ అభిమానులను అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా అంతకు ముందే విడుదల చేశారు. ఈ సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులు అభిమానులతో అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ కనిపిస్తున్న లుక్ ప్రేక్షకులను అలరిస్తోంది. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా.. దిల్ రాజు బేనర్ పై దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.