: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండు పెరగడంతో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 పెరిగి, రూ.29,350గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి మరో రూ.5 రూపాయలు మాత్రమే పెరిగి రూ.40,265గా నమోదైంది.