: నాన్నతో నేను పోటీపడలేకపోతున్నా: నారా లోకేష్
ఇంత వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన వేగంతో తాను కూడా పోటీ పడలేకపోతున్నానని చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అనంతపురం జిల్లాకు కియా కార్ల సంస్థను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని చెప్పారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం రూ. 42.92 కోట్లు ఖర్చు చేశామని, వారి పిల్లల కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మన దేశంలో మరే ఇతర పార్టీ అయినా తమ కార్యకర్తల కోసం ఇన్ని నిధులను ఖర్చు చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు.