: ఏనుగుకి కిళ్లీ అంటే ఇష్టం... పాన్ తిని దీవించి వెళ్తుంది... వీడియో చూడండి!


సుష్టుగా భోజనం చేసిన తరువాత మంచి కిళ్లీ (పాన్) వేసుకుంటే జీర్ణానికి మంచిదని కొందరి అభిప్రాయం. దీంతో మంచి భోజనం అనంతరం పాన్ ఇవ్వడం సంప్రదాయంగా కూడా మారింది. దీనిని చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ పాన్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ పట్టణంలో ఒక ఏనుగుకు కూడా చాలా ఇష్టం. అది కూడా ఏదైనా తిన్న తరువాత వీధి చివరన ఉండే పాన్ షాప్ కు వెళ్తుంది. అక్కడ పాన్ షాప్ యజమాని ఈ ఏనుగును చూడగానే పెద్ద తమలపాకుల్లో కిళ్లీ కట్టి దాని నోట్లో పెడతాడు. దానిని ఇష్టంగా తిని ఆ షాప్ యజమానిని దీవించి వెనుదిరుగుతుంది. పాన్ తినే ఏనుగును చూసేందుకు భారీ ఎత్తున స్థానికులు ఎగబడతారు. ఈ ఏనుగు కోసం ఆ షాప్ యజమాని ప్రత్యేకంగా పెద్ద తమలపాకులు తెప్పిస్తాడు.


  • Loading...

More Telugu News