: విమానం టేకాఫ్ అవుతుందనగా... డోర్ తీసి దూకేసిన ప్రయాణికుడు!
విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి లేచి విమానం డోరు తెరచి దూకేసిన ఘటన అమెరికాలోని ఉత్తరకరోలినా డగ్లస్ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నెంబరు 5242 లో చోటు చేసుకుంది. 22 ఏళ్ల సేన్ అనే యువకుడు తోటి ప్రయాణికులతో అంతకుముందే గొడవ కూడా పెట్టుకున్నాడని సంబంధిత అధికారులు చెప్పారు. మొదట ఆ యువకుడు విమానం ప్రధాన ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడని, అడ్డొచ్చిన విమాన సిబ్బందిని కొట్టాడని చెప్పారు. చివరికి తలుపు తీసి కిందకి దూకేశాడని, అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఆ వ్యక్తి విమానం నుంచి ఎందుకు దూకేశాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.