: అమెరికాలో కాల్పుల కలకలం... ఎనిమిది మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. మిసిసిపిలో ఓ దుండగుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడని అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వెంటనే స్పందించిన పోలీసులు కాల్పులకు పాల్పడ్డ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఆ నిందితుడు ఈ కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.